ఉప్పు తింటే కొందరిలో బీపీ రైజ్ అవుతుంది... కారణం ఇదే!
- ఉప్పు కొందరిలో బీపీ పెంచడానికి వయసు, జన్యువులు కారణం
- ఉప్పుకు శరీరం స్పందించే తీరునే సోడియం సెన్సిటివిటీ అంటారు
- వయసు పెరిగేకొద్దీ సోడియంను బయటకు పంపే సామర్థ్యం తగ్గుతుంది
- ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే హిడెన్ సోడియంతో అధిక ముప్పు
- జీవనశైలి మార్పులతో రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణుల సూచన
కొంతమంది ఎంత ఉప్పు తిన్నా ఏమీ కాదు, కానీ మరికొందరికి మాత్రం కొద్దిగా ఉప్పు ఎక్కువైనా రక్తపోటు (హైపర్‌టెన్షన్) అమాంతం పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం వయసు, జన్యువులు, రోజువారీ అలవాట్లని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పు విషయంలో ఒక్కో శరీరం ఒక్కోలా స్పందిస్తుందని, దీన్నే 'సోడియం సెన్సిటివిటీ' అని అంటారని వారు వివరిస్తున్నారు.
ఉప్పు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి రక్తపోటు సులభంగా పెరగడాన్నే 'సోడియం సెన్సిటివిటీ' అంటారు. కొందరిలో సోడియం ప్రభావం తక్కువగా ఉంటే, మరికొందరిలో స్వల్ప మోతాదుకే బీపీ గణనీయంగా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ మూత్రపిండాల పనితీరు మందగించడం, రక్తనాళాలు దృఢంగా మారడం వల్ల శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల వృద్ధుల్లో ఉప్పు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
రక్తపోటు, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు జన్యుపరంగా సోడియంకు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటారని వైద్య నిపుణులు తెలిపారు. ఇలాంటి వారికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ఒత్తిడి తోడైతే ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇన్స్టంట్ నూడుల్స్, సాస్‌ల వంటి వాటిలో దాగి ఉన్న 'సోడియం' తెలియకుండానే శరీరంలోకి చేరి ముప్పును పెంచుతోందని వివరించారు.
ఈ సమస్యను అధిగమించడానికి జీవనశైలి మార్పులే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండటం, ఇంట్లో వండిన తాజా భోజనం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారు, కుటుంబంలో హైపర్‌టెన్షన్ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా రక్తపోటును పర్యవేక్షించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.